Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్
నవతెలంగాణ-మహబూబాబాద్
ఆశ్రమాల్లో వసతుల కల్పనకు చర్యలు తీసు కోవాలని అధికారులను అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. పట్టణంలోని చిల్డ్రన్స్ హోమ్ బార్సు హాస్టల్, అనాథ బాలల ఆశ్రమం, బాలల సంరక్షణ భవన్, సఖి సెంటర్లను ఆమె శనివారం సందర్శించి సేవా కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. చిల్డ్రన్ హోమ్ బార్సు హాస్టల్ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. అనాథ బాలల ఆశ్రమంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పిల్లలకు వినోదం తోపాటు విజ్ఞానం అందించేలా టీవీ పెట్టించాలని, క్రీడాస్థలం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆశ్రమ ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించా లని, పండ్ల మొక్కలు నాటించాలని చెప్పారు. ఆశ్రమానికి నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. బాలల సంరక్షణ భవనాన్ని తనిఖీ చేసి వసతులను పర్యవేక్షించారు. బాలల సంరక్షణపై ప్రత్యేక దష్టి పెట్టాలని సూచించారు. సఖి సెంటర్ భవనాన్ని పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. సఖి సెంటర్ నిర్వహణ తీరును పరిశీలించారు. కేసులను పరిష్కరించినప్పుడే గుర్తింపు వస్తుందని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ వెంట బాలల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ నాగవాణి, జిల్లా మహిళ శిశుసంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనిన్, సఖి సెంటర్ నిర్వాహకులు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.