Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
కరోనా వ్యాక్సినేషన్‌ను పీహెచ్సీ పరిధిలో వందశాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలని నల్లబెల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేందర్ నాయక్ తెలిపారు. శనివారం పీహెచ్సీలో వ్యాక్సినేషన్ గురించి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సిబ్బంది వ్యాక్సిన్ పట్ల ప్రజలకు ఉన్న ఆపోహలను తొలగిపోయేలా అవగాహన కల్పించాలన్నారు. వారు వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. వందశాతం వ్యాక్సినేషన్ నిర్వహించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ ఎన్ రజిని, హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.