Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాన-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వంద శాతం గంజాయిని నియంత్రించి గంజాయి రహిత పోలీస్ కమిషరేట్‌గా మార్చడమే మన ముందున్న లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోసి పోలీస్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా నిట్ కళాశాల బోస్ ఆడిటోరియంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్, డీజీపీ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న నెలరోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ను గంజాయి రహిత కమిషనరేట్‌గా మార్చడం కోసం హౌంగార్డు నుంచి డీసీపీ స్థాయి అధికారి వరకు కష్టపడాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి, గుట్కా రవాణాకు పాల్పడిన వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించాలన్నారు. వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరాతీయాలన్నారు. గంజాయి వినియోగించే వారి సమాచారాన్ని కూడా అధికారులు సేకరించాల్సి వుంటుందన్నారు. గంజాయి రవాణాకు పాల్పడే వారి సమాచారాన్ని తెలుసుకోనేందుకుగాను పటిష్టమైన ఇన్ ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమాచారం అందించిన వ్యక్తులకు నజారాలను అందించి వారి వివరాలను గోప్యంగా వుంచాలన్నారు. అలాగే గంజాయి నియంత్రణలో ప్రతిభ కనబరిన అధికారులు, సిబ్బందికి శాఖపరమైన గుర్తింపు ఇవ్వాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి గంజాయి నియంత్రణ కోసం స్టేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్చించాలన్నారు. ముఖ్యంగా గంజాయి నియంత్రణ తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నియంత్రించే మార్గాలపై అధికారులు దష్టి పెట్టాలన్నారు. గంజాయి కట్టడికి పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేజీలపై దష్టి సారించాలన్నారు. గంజాయి అమ్మకాలు, వినియోగం వలన జరిగే పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ అధికారి తన స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి గంజాయి కేసులు నమోదు కాలేదని ఆలసత్వం ప్రదర్శించకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నేరం జరిగాక బాధపడే కన్నా నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమన్నారు.
గంజాయి రవాణా, సాగుకు పాల్పడే వారి మూలాలను గుర్తించి వారిని పట్టుకోవాలన్నారు. గంజాయి రవాణాకు పాల్పడిన నిందితులపై అవకాశాన్ని బట్టి పీడీయాక్ట్లను నమోదు చేయాలన్నారు. గంజాయి నిందితుల నేరాలు కోర్టులో రుజువయ్యే విధంగా నైపుణ్యంతో కూడిన దర్యాప్తుతో పాటు తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపె ట్టాలన్నారు. స్టేషన్ అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలోని పాన్ షాపులను తనీఖీ చేయాల్సి వుంటుందన్నారు. పాన్‌షాపుల్లో రోల్పేపర్ అమ్మకాలకు పాల్పడే వారిపై కేసులను నమోదు చేయాలన్నారు. పోలీసులు మత్తు పదార్థాలపై చేస్తున్న యుద్ధం కోసం అధికారులు అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో సమన్వయంతో పని చేయా లన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు వెంకలక్ష్మీ, పుష్పారెడ్డి, ఏఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఏఆర్ అదనపు డీసీపీలు భీంరావు, సంజీవ్ తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.