Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ కోరారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కలవచర్ల రాజు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎంపీలు అభి ఖాన్, తదితరులు పాల్గొన్నారు.