Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామానికి చెందిన తుంగ పాటి సాంబయ్య ఇటీవల మృతి చెందగా అతడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు బద్దం లింగారెడ్డి ఆధ్వర్యం లో సోమవారం రూ.2 వేలు, బియ్యం అందించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి మాట్లాడారు. మతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు పన్నాల ఎల్లారెడ్డి, గ్రామ యూత్ అధ్యక్షుడు కొల్లు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ కిసాన్ సెల్ అధ్యక్షుడు సామ సమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మందడి ఉత్తరయ్య, ఉపాధ్యక్షుడు పంగ శ్రీను, వార్డు సభ్యులు చెరుకుల సురేష్, కొర్ర శ్రీను, ఏనుగు సునీత, మిరియాల యాదగిరిరెడ్డి, పగడాల మల్లారెడ్డి, బద్దం భరత్, కర్ర మహేందర్, మేడ సైదిరెడ్డి, బొంగు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.