Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పీవైఎల్ డివిజన్ కార్యదర్శి ధర్మారపు యాకసోములు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం ఏఓ యోగీశ్వర్రావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యాకసోములు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తానని నమ్మించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడచినా నియామకాలు చేపట్టడం లేదని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోడీ అందుకు భిన్నంగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ రంగాలకు అప్పచెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలతో నిరుద్యోగులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, మధు, నరేష్, వెంకన్న, ఉమేష్, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.