Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ-కేసముద్రం రూరల్
నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ విద్యార్థిని పాఠశాల యాజ మాన్యం, ఉపాధ్యాయ బందం సోమవారం ఘనంగా సన్మానిం చారు. కేసముద్రం మండలంలోని శ్రీ వివేకవర్ధిని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మామునూరులోని జవహర్ నవో దయ విద్యాలయంలో ఆరో తరగతిలో సీటు సాధించిన బండి యానిష్ను పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యకాంతం గౌడ్ సన్మానించారు. అనంతరం యాకాంతం గౌడ్ మాట్లాడారు. క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం లాంటి సద్గుణాలు కలిగిన విద్యార్థి యానిష్కు నవోదయలో సీటు రావడం హర్ష ణీయమన్నారు. యానిష్ కష్టపడి చదివి నవోదయలో సీటు సాధించి తల్లిదం డ్రులకే కాకుండా హైస్కూల్‌కు సైతం పేరు తెచ్చాడని అభినందించారు. అనంతరం విద్యార్ధి తల్లిదండ్రులు లక్ష్మణ్-రజిత కరస్పాండెంట్ చిర్ర యకాంతం గౌడ్‌ను సన్మానించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడికి నవోదయ సీటు రావడానికి శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ ఉపాధ్యాయుల కషి, పట్టుదలే కారణమని స్పష్టం చేశారు.