Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనంతరెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
కాకతీయులు నిర్మించిన లక్నవరం చెరువు మరమ్మతులకు నిధులు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యానాల అనంతరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడారం త్వరలో జరగనుందన్నారు. లక్నవరం చెరువు నీటిని5 అడుగుల నీరును వాడుకుంటారని, చెరువు తూములు, కాల్వల మరమ్మతు చేయించాలని తెలిపారు. లీకేజీ వల్ల నీరు వథాగా పోతోందని చెప్పారు. కొన్ని కాల్వలు అధ్వాన్నంగా ఉన్నట్టు తెలిపారు. యాసంగి పంటకు నీరు తగ్గే ప్రమాదమున్న క్రమంలో జాతర నిధుల్లోంచి లక్నవరం చెరువు మరమ్మతులకు రూ.10 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి సురవరపు వెంకట్రామయ్య, పార్టీ మండల అధ్యక్షుడు జంపాల సత్యనారాయణ, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు నర్రా శివాజీ, నాయకులు రాజయ్య, ఈర్ల పాపులు, తదితరులు పాల్గొన్నారు.