Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
శ్రీచైతన్య, నారాయణ, ఫిట్జీ విద్యాసంస్థలపై కేసు నమోదు చేయాలని ఏఐ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బందు మహేందర్ కోరారు. ఈ మేరకు ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై గుండ్రాతి సతీష్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మహేందర్ మాట్లాడారు. జేఈఈ అడ్వాన్స్ డ్ 2021 ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించిన మదల్ అగర్వాల్ రాజస్థాన్‌లోని అల్లెన్ కెరీర్ ఇనిస్టిట్యూషన్ విద్యార్థి కాగా తమ కళాశాల విద్యార్థిగా శ్రీచైతన్య, నారాయణ, ఫిట్జీ విద్యాసంస్థలు ప్రకటించి సమాజాన్ని మోసం చేస్తున్నాయని తెలిపారు. ఒకే విద్యార్థి ర్యాంక్‌ను పలు విద్యాసంస్థలు ఉపయోగించుకొవడం సాధ్యమేనా అనే ప్రశ్నించారు. తప్పుడు ప్రచారంపై విచారణ చేపట్టి బోగస్ ర్యాంక్‌లతో మోసం చేస్తున్న శ్రీచైతన్య, నారాయణ, ఫిట్జీ విద్యాసంస్థలపై, సదరు విద్యార్థి మదల్ అగర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆ సంఘం నాయకులు వేణు, దిలీప్, సాయి, తదితరులు పాల్గొన్నారు.