Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నాయకుల నివాళ్లు
నవతెలంగాణ-ములుగు
మండలంలోని పత్తిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నునావత్ సారయ్య అనారోగ్యంతో బాధపడుతూ పరిస్తితి విషమించి మృతి చెందాడు. అతడి మృతదేహానికి డీసీసీ అద్యక్షుడు కుమారస్వామి సోమవారం పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. నివాళ్లర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు చాంద్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మత్స పారిశ్రామిక సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల రవి, ఎంపీటీసీ మావూరపు తిరుపతిరెడ్డి, పొట్లాపూర్ సర్పంచ్ అంకిరెడ్డి, నాయకులు నగావత్ ప్రతాప్, గద్దల వెంకటస్వామి, అర్షం రఘు, పోరిక రాజు, మూడు రవీందర్ తదితరులున్నారు.