Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
వరుసగా టీవీలు మాయమౌతున్న ఘటన మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య కేంద్ర ఇన్ఛార్జి వైద్యాధికారి గోపీనాథ్ పూర్తి కథనం ప్రకారం రెండు నెలల క్రితం ఆరోగ్య కేంద్ర తాళాలు పగలగొట్టి రూ.20 వేలు విలువైన టీవీని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడంతో కొయ్యూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే రెండోసారి టీవీ దొంగతనం జరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆదివారం తాళాలు వేసి చూడగా టీవీ చోరీకి గురైనట్టు సిబ్బంది తన దష్టిని తీసుకొచ్చినట్టు వైద్యాధికారి తెలిపారు. తాడిచెర్ల బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ సామాజిక సేవ పథకం కింద గతంలో టీవీని అందజేసిందని వివరించారు. ఆస్పత్రికి తాళం వేసి ఉండగానే టీవీ చోరీ కావడంతో సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.