Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
నవంబర్ 1 నుంచి 9 వరకు గోదావరి లోయ సాయుధ ప్రతిఘటన పోరా టంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు బూర్క వెంకటయ్య కోరారు. మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో మండల నాయకులు యాదగిరి యుగంధర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో వెంకటయ్య మాట్లాడారు. విప్లవోద్యమ చరిత్రలో నవంబర్ నెలకు ప్రత్యేకత ఉందన్నారు. ఎంఎల్ పార్టీల నిర్మాత చండ్ర పుల్లారెడ్డి నవంబర్లోనే అమరుడయ్యాడని గుర్తు చేశారు. రష్యా సోషలిస్ట్, చైనా ప్రజాతంత్ర విప్లవాలు పురుడు పోసుకున్నది నవంబర్లోనే అని చెప్పారు. ఉమ్మడి పాకాల కొత్తగూడం మండలంలో పార్టీ నిర్వహించిన పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించి రాజ్యం నిర్బంధాలకు ఎదురొడ్డి అనేక మంది అమరులయ్యారని చెప్పారు. వారిని స్మరిస్తూ గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర నాయకురాలు ఆగబోయిన నర్సక్క, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, మండల నాయకులు దేవులపల్లి మంగన్న, పిట్టల దేవేందర్, గుగులోతు హచ్చ, సరోజన, రమ, సంధ్య, రజిత, తదితరులు పాల్గొన్నారు.