Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ నియామకాల్లో ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లా కలెక్టర్కు వినతి
నవతెలంగాణ-ములుగు
ఏజెన్సీ దళితులు సాగు చేసుకుంటున్న పొడుభూములను సర్వే చేయించి హక్కుపత్రాలు అందజేయాలని, జీఓ నెంబర్ 3పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని కోరుతూ నేతకానీ సమన్వయ కమిటీ జిల్లా సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్యను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. అనేక తరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములను సాగు చేసుకుంటు జీవిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు పట్టాలు లేక రైతుబంధు, రైతుభీమా వర్తించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఏజెన్సీలోని ఎస్సీలకు ఎస్టీలతోపాటు సమాన హక్కులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనగం చిన వీరస్వామి, చెన్నూరి నర్సయ్య, గాందెర్ల సారయ్య, బండి వీరస్వామి, రామటెంకి చంద్రయ్య, జనగం వెంకన్న, గాందెర్ల పాపయ్య, గోగు ముత్తయ్య, జనగం సమ్మయ్య, దుర్గం సమ్మయ్య, జనగం లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.