Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.80 కోట్లతో టైబల్ వెల్ఫేర్ పనులు ముమ్మరం
ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత
సులబ్ కాంప్లెక్స్ పనులు ప్రారంభం
నవతెలంగాణ-తాడ్వాయి
వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహా జాతర జరగనున్న క్రమంలో జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య ప్రత్యేక దష్టి పెట్టారు. సందర్శకుల సౌకర్యార్థం రూ.112 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కాగా జాతర సమయం దగ్గర పడుతున్నా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తన గ్రాంట్ కింద ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా శాశ్వత అభివద్ధి పనుల కోసం రూ.1.80 కోట్లు విడుదల చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేమలత, డీఈ వినరు కుమార్, ఏఈ ఆబిద్‌ఖాన్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రూ.29.46 లక్షలు, పోలీస్ క్యాంప్ పరిధిలో రూ.29.46 లక్షల వ్యయంతో సులబ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ముగ్గు పోసి ప్రారంభించారు. చిలకలగుట్ట దారిలో నిర్మించిన రెవెన్యూ భవనంపై రూ.24.33 లక్షలతో రెవెన్యూ విశ్రాంతి హాల్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జంపన్న వాగు వద్ద రూ.34 లక్షలతో దుస్తులు మార్చుకునే గది, ఇంగ్లీష్ మీడియం సమీపంలో రూ.29.65 లక్షలతో డైనింగ్ హాల్ షెడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఐటీడీఏ గెస్ట్‌హౌస్ పక్కన మేడారం పీఎస్ పాఠశాల ఆవరణ వెనకాల రూ.12.60 లక్షల వ్యయంతో 20 కేఎల్ సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ప్రారంభించారు. అనేక ఏండ్లుగా మేడారం మహాజాతరకు ఎన్నడూ లేని విధంగా నాలుగు నెలల ముందే కలెక్టర్ నిధుల నుంచి మేడారంలో శాశ్వత సౌకర్యాల కోసం నిధులు కేటాయించినందుకు పూజారుల, ఆదివాసీ సంఘాలు, ప్రజలు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.