Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ప్రభుత్వం చేపట్టిన స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2021ను విజయవంతం చేయాలని డీఈఓ పాణిని కోరారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన స్కూల్ ఆప్ ఇన్నోవేషన్ చాలెంజ్-2021 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. పాఠశాల విద్య, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి విద్యార్థులకు డిజైన్ థింకింగ్‌లో శిక్షణ ఇచ్చి నూతన ఆవిష్కరణలు తీసుకరావడం కోసం గతేడాది నుంచి కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. హైస్కూల్లో చదువుతున్న విద్యార్థుల్లోని సజనాత్మక ఆలోచనలు, నైపుణ్యాలను వెలికితీసేందుకు స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ నిర్వహణకు సిద్ధమైనట్టు చెప్పారు. ఏటా పోటీలు ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాగా ఈసారి ప్రయవేట్ పాఠశాలలకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే విద్యార్థులకు బహుమతి లభిస్తుందని వివరించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటాలని సూచించారు. ఈనెల 30 నుంచి నవంబర్ 12 వరకు ఉపాధ్యాయుల శిక్షణ ఆన్లైన్ వేదికగా ఉంటుందని చెప్పారు. షెడ్యూల్‌ను వివరించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, ఏసీజీఈ రమేష్, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు బద్దం సుదర్శన్‌రెడ్డి, రమాదేవి, సాంబయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.