Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే దొంతి
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
బడుగు, బలహీన వర్గాలకు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పెద్దకొర్పోలుకు చెందిన టీఆర్ఎస్ పార్టీ, కుల సంఘాలకు చెందిన 50 కుటుంబాలు దొంతి మాధవరెడ్డి సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి దొంతి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కుమార స్వామి,వెంకన్న, సురేష్, సంపత్, వెంక టయ్య, రమేష్, ముత్యాలు, నారాయణ, మధు సూధన్, రాజు, ధర్గయ్య, వెంకన్న తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు రంజిత్‌రెడ్డి, మండల పార్టీ, పట్టణ అధ్యక్షులు అశోక్, హరిప్రసాద్, గ్రామపార్టీ అధ్యక్షులు లక్ష్మణ్, యూత్ అధ్యక్షులు మైపాల్‌రెడ్డి, ప్రశాంత్, ప్రవీణ్, మల్లిక్, సుబ్బారెడ్డి, యాదగిరి, చేరాలు, సాంబయ్య పాల్గొన్నారు.