Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీడీ నూరోద్దీన్
నవతెలంగాణ-పాలకుర్తి
వ్యాపార అభివద్ధిలో మహిళలు ముందుండి ఆర్థికాభివద్ధిని సాధించాలని ఏపీడీ నూరోద్దీన్ మహిళలకు సూచించారు. సోమవారం స్థానిక రైతు వేదికలో ఐకేపీ ఆధ్వర్యంలో స్వీప్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు వ్యాపార రంగంపై పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, స్టేషన్ ఘన్పూర్ మండలాల్లోని ఏపీఎం, సీసీలకుకు మండల సమైక్య నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్విప్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నాలుగు మండలాల్లో ఐదు కోట్ల వ్యాపారం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. వ్యాపార రంగంలో మహిళలు ఆర్థికంగా అభివద్ధి చెందేందుకు ఒక్కో డ్వాక్రా గ్రూపు కు పదివేల నుంచి ఐదులక్షల వరకు రుణం అందిస్తామని పేర్కొన్నారు. వ్యాపార అభివద్ధిలో మహిళలు ముందుండే విధంగా ప్రతిఒక్కరూ దష్టి పెట్టాలని సూచించారు. వ్యాపార అభివద్ధిలో మహిళలకు అవగాహన కల్పించాలని, వారిలో చైతన్యాన్ని పెం పొందించాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎంలు సమ్మక్క, సుజాత, రాజేంద్రప్రసాద్, శ్రీనిధి పూర్ణచందర్ రావు, ఏపీఎంలు రమణాచారి, సురేందర్, విజయ, కవిత, సీసీలు తదితరులు పాల్గొన్నారు.