Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రీజనల్ కో-ఆర్డినేటర్ విద్యారాణి
నవతెలంగాణ-శాయంపేట
పాఠశాలలోని తరగతి గదులలో ప్రత్యక్షంగా నిర్వహించే విద్యా బోధన ద్వారానే విద్యార్థులకు విషయ పరిజ్ఞానం లభిస్తుందని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల రీజినల్ కో-ఆర్డినేటర్ విద్యారాణి అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, తరగతి గదులను, వంటశాలను, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులతో, ఉపాధ్యాయులతో మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం విద్యా సంస్థలను మూసి వేసిందని, 15 నెలల తర్వాత గురుకుల పాఠశాలలలో ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇవ్వడంతో విద్యార్థులు ఉత్సాహంతో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులకు అన్ని వసతులు సమకూర్చినట్లు తెలిపారు. కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ తరగతులు ద్వారా అకాడమిక్ ఇయర్ సిలబస్ పూర్తి చేశామని, జూమ్ క్లాస్ ల ద్వారా ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడు రీచ్ అయినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించామని, కాంపిటీషన్ పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉన్నారని, నేటి నుంచి ప్రత్యక్ష తరగతుల ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలు ప్రారంభించి నందుకు ప్రభుత్వానికి, గురుకుల సెక్రెటరీ కి కతజ్ఞతలు తెలియజేశారు. ఆమె వెంట అసిస్టెంట్ రీజినల్ కోఆర్డినేటర్ శరత్ బాబు, ప్రిన్సిపాల్ సుభాషిని దేవి, వైస్ ప్రిన్సిపల్ శ్రీజ తదితరులు పాల్గొన్నారు.