Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐ టీయూ జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి డిమాండ్ చేశారు. స్థానిక కొత్త బస్టాండ్ సెంటర్లో సోమవారం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరే షన్(బీసీడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వెల్ఫేర్ బోర్డ్ నుంచి దారి మళ్లించిన ఒక వేయి నాలుగు కోట్ల రూపాయలు తిరిగి సంక్షేమ బోర్డులో జమ చేయాలన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సుమారు 2800కోట్ల రూపాయలు నిధుల వెల్ఫేర్బోర్డ్లో జమ అయ్యాయన్నారు. తెలంగాణకు రావాల్సిన రూ.లు 400కోట్లు బ్యాంకులో మూలుగుతున్న నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్రంలో 20లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే 12ఏండ్లుగా పన్నెండున్నర లక్షల పేర్లు మాత్రమే బోర్డ్‌లో నమోదు చేశారన్నారు. వెల్ఫేర్ బోర్డ్‌లోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లో ఉన్న 36వేల పెండింగ్ సమ స్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సీఐటీయూ మండల కార్యదర్శి జిల్లా రమేష్ ఆధ్వర్యంలో బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రావుల రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎండీ యాకుబ్, కోశాధికారిగా రామ్ చందర్, ఉపాధ్యక్షులుగా కొమురయ్య, బండారి రాజు, కూసం రామ చంద్రు, నారెల్లి శ్రీనివాస్, వల్లాల రాజేందర్, చెవ్వు వెంకటేశ్వర్లు, సారయ్య, సహాయ కార్యదర్శులుగా ఎం రాములు, రాజు, రమేష్, ఎండీ రహమాన్, రాపాక శ్రీనివాస్, ఎండీ యాకుబ్, సహాయ కార్యదర్శిగా సురేష్‌లతో పాటుగా కమిటీ సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు.