Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఎస్ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు మంద శ్రీకాంత్ అన్నారు. పెద్దకొడపాకలోని ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పించడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టాయిలెట్స్, త్రాగునీరు, ఫ్యాన్స్, లైట్స్, తరగతి గదులు, ఆట వస్తువులు లాంటివి ప్రభుత్వ విద్యా సంస్థల్లో సరిగా లేవని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు చొరవ చూపి విద్యారంగ సమస్యల పైన దష్టి సారించాలన్నారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కళ్యాణ్, ప్రశాంత్, వినరు, రాకేష్, యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నర్సంపేట
సంక్షేమ హాస్టళ్లలో మౌళిక సదుపాయలను వేగవంతంగా కల్పించాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని పలు సంక్షేమ హాస్టళ్లను ఎస్ఎఫ్ఐ బృందం సందర్శించింది. అస్తవ్యస్తంగా ఉన్న హాస్టళ్ల ప్రాంగాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లు తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం ముందుస్తూ సదుపాయాలను కల్పించడంలో విఫలమైందన్నారు. రెండేండ్ల తర్వాత తెరుచుకున్న హాస్టళ్లలో ముందుస్తుగా విదార్థులకు కావాల్సిన మౌళిక సదుపాయాలను కల్పించకుండా గాలి కొదిలేసిందన్నారు. అపరిశుభ్రంగా ఉన్న గదులు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, పరిసరాలతో విద్యార్థులు హాస్టళ్లలో ఎలా ఉండగలుగుతారని ప్రశ్నించారు. కనీసం త్రాగు నీటి సౌకర్యం కూడా లేని హాస్టళ్లు ఉన్నాయన్నారు. హాస్టల్ వార్డెన్లు శానిటేషన్ చేయించిన దాఖలాలు లేవన్నారు. వెంటనే హాస్టళ్లను పరిశుభ్రంగా చర్యలు చేపడుతూ విద్యార్థులకు కావాల్సిన నోట్ బుక్సు, దుప్పట్లు, దోమల తెరలు పంపిణీ చేయాలని, ప్రతి సంక్షేమ హాస్టల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్ష్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్, నరేష్, శ్రీనివాస్, కష్ణ, తదితరులు పాల్గొన్నారు.