Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. ఈ మేరకు హన్మకొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ముగింపు సమయానికి 72 గంటల ముందు నుంచే ప్రచారం నిలిపేయాలని, గంపగుత్తగా మొబైల్ సందేశాలు కూడా పంపడానికి వీల్లేదని రాజకీయ పార్టీలకు, పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్పష్టం చేశారు. ఈనెల 28న సాయంత్రం 7 గంటల నుంచే మద్య నిషేధం అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల రోజు ఈనెల 20న హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించారు. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలకు ఈనెల 29, 30తేదీలలో స్థానిక సెలవు ప్రకటించారు. ఎన్నికల ముగింపు సమయానికి 72 గంటల ముందు నుండి 144 సెక్షన్ అమలులో వుంటుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ర్యాంప్లతోపాటు తాగునీటి సౌకర్యం కల్పించాలని, అలాగే వికలాంగుల కోసం వీల్చైర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.