Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పోలీస్ ఫ్లాగ్‌డేను పురస్కరించుకొని ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఓపెన్హౌజ్ను పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పోలీసుల పనితీరును, ఆయుధాలు, టెక్నాలజీ వినియోగంపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడంలో భాగంగా కరోనా కారణంగా ఆన్లైన్ ద్వారా ఓపెన్హౌజ్ను ప్రదర్శించడానికి ఏర్పాటు చేశామన్నారు. ఈ ఓపెన్‌హౌజ్ పోలీసు కమిషనర్ బాంబు డిస్పోసబుల్, డాగ్ స్క్వాడ్, కమ్యూనికేషన్స్, ఫింగర్ ప్రింట్, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా వినియోగించే సాధనలు, ఆయుధాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, అదనపు డీసీపీలు భీంరావు, సంజీవ్, జనార్ధన్, ఏసీపీలు శ్రీనివాస్, నాగయ్య, ఆర్ఐలు శ్రీనివాసరావు, భాస్కర్, నగేష్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.