Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కాజీపేట
ఖాజీపేట ఫాతిమా నగర్ నందు గల లొడి స్వచ్ఛంద సంస్థ కార్యాలయం నందు హెచ్ఐవి ఎయిడ్స్ బాలబాలికలకు పౌష్టికాహార సరుకులు విద్య అభివద్ధి కొరకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం లోడి సంస్థ డైరెక్టర్ ఫాదర్ విజయ పాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వరంగల్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ శారద, ఉమ్మడి జిల్లా బాలబాలికల సంరక్షణ విభాగం మాజీ చైర్పర్సన్ మండల పరిశురములు హాజరై బాలబాలికలకు పౌష్టికాహార సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాలబాలికలకు లోడి స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం అన్నారు బాల బాలికల ఆరోగ్యని దష్టిలో పెట్టుకొని రెండు నెలలకోసారి సరుకులు పంపిణీ చేయడం విద్య అభివద్ధి కొరకు ఆర్థిక సహాయం పుస్తకాల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పెన్షన్ అందలేని వారిని గుర్తించి తక్షణమే పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ బాజీ, వీరబాబు, సభ్యులు నాగరాజు, శిరీష, హరీష్, అనిత, సిస్టర్ ఎలిషమ్మ, జిల్లా నెట్వర్క్ ప్రెసిడెంట్ రవీందర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.