Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామెర
పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి చెందిన ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గడ్డం రాజు (38) శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రాజు సోమవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. వ్యవసాయంలో వచ్చిన నష్టాల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.