Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
విద్యార్థులు చదువులకే పరిమితం కాకుండా క్రీడల్లో ప్రతిభ చాటి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని ఎల్లంపేట గ్రామంలోని ప్రభుత్వ జెడ్పీ సెకండరీ స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ఈనెల 22న జిల్లా కేంద్రంలో జరిగిన సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థిని ఉర్లుగొండ స్పందనను ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు మంగళవారం అభినందించారు. భవిష్యత్లో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు పాల్గొన్నారు