Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్
నవతెలంగాణ-ములుగు
వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదనే విషయాన్ని గుర్తించి మనోధైర్యంతో ఉండాలని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. మండల కేంద్రానికి చెందిన ఓరుగంటి రజిత ఇటీవల అనారోగ్యంతో కాలు కోల్పోయగా తస్లీమా మంగళవారం ఆమెను పరామర్శించి మాట్లాడారు. వికలాంగులు సమాజంలో ఎదురౌతున్న ఆటుపోట్లను ఆత్మవిశ్వాసంతో జయించాలని సూచించారు. వికలాంగులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రజిత కొడుకు ప్రిన్స్‌ను మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్‌తో మాట్లాడి చేర్పించారు. రజితకు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నగదు సాయం అందించారు. తస్లీమా వెంట ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులున్నారు.