Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-పరకాల
ఏకాగ్రతతో చదివితే లక్ష్యాలు సాధించడం సులభమని వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) డాక్టర్ తరుణ్ జోషీ అన్నారు. స్థానిక గణపతి డిగ్రీ, బీఈడీ కళశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ శిక్షణ తరగతులను మంగళవారం ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎస్సై, కానిస్టేబుల్ నియామాకాల్లో పేద యువత రాణించాలనే లక్ష్యంతో పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డివిజన్ పరిధిలో ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. డివిజన్ పరిధిలో ఎంపికైన 200 మంది అభ్యర్థులకు 80 రోజులపాటు పోటీ పరీక్షల్లో అంశాలతోపాటు వివిధ పాఠ్యాంశాల్లో నిపుణులైన అధ్యాపకుల చేత శిక్షణ అందజ ేస్తున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. త్వరలో పోలీస్ నియామాకాలకు సంబంధించి ప్రకటన విడుదల అవుతుందన్నారు. ప్రకటన వెలువడే నాటికి 60 శాతం సిలబస్ పూర్తవుతుందని, పరీక్షకు సిద్దం కావచ్చని తెలిపారు. పోటీ పరీక్షల్లో పాల్గోనే అభ్య ర్థులు సెల్ ఫోన్‌కు దూరంగా ఉండాలని సూచించారు. యువత సమయాన్ని వృధా చేయకుండా సాధన చేస్తే ఉద్యోగా లను సాధింగలరని చెప్పారు. కార్యక్రమం లో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ, పరకాల ఏసీపీ శివరామయ్య, పరకాల ఆత్మకూరు, శాయంపేట ఇన్స్పెక్టర్లు మహేందర్‌రెడ్డి, రంజిత్, రమేష్, ఎస్సైలు ప్రవీణ్, శ్రీకాంత్, పీజేఆర్ డైరెక్టర్ జగదీష్‌రెడ్డి, గణపతి కళాశాల డైరక్టర్ నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.