Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం (టౌన్)
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి కష్ణ ఆదిత్య హెచ్చరించారు. బుధవారం ఏటురునాగరం ఐటీడీఏ పరిధిలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫైల్స్, ఈ ఫైలింగ్, ఆన్లైన్ అటెండెన్స్ తదితర అంశాలపైన సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రొజెక్టర్ సహాయంతో ఈ ఫైలింగ్ విధానంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. ఈ ఫైలింగ్ చేసేముందు పూర్తి వివరాలతో సమర్పించాలని ఆదేశించారు. స్కూల్స్ లో టీచర్ పోస్ట్‌ల వేకెన్సి, స్కూల్లో విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను అధికారులతో చర్చించారు. హాస్టల్స్‌లో పిల్లలకి పౌష్టికాహారాన్ని అందజేయాలన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో టీచర్ పోస్టుల విషయంలో వెకెన్సి లేకుండా చూడాలని , పిల్లలకి ఇబ్బందీ లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. ఒక్క టీచర్ చనిపోతే వారికి రావలసిన బెనిఫిట్స్ అందాయ లేదా అనేది సంబంధిత అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. త్వరితగతిని ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిలు అందేలా చూడాలన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లో అత్యవసరం నిమిత్తం అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేయాలన్నారు. పీహెచ్సీ కేంద్రాలలో అంబులెన్స్ సౌకర్యం ఉన్నదని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా|| వెంకటేశ్వర్లును, ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఏఓ దామోదర్ స్వామి, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఎర్రయ్య, అర్సీఓ రాజ్యలక్ష్మి, జీసీసీ మేనేజర్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్ కుమార్‌ను కలెక్టర్ కష్ణ ఆదిత్య ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి పలు విభాగాలను పరిశీలించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వైద్యం అందించడానికి వైద్యులు సహకరించాలన్నారు.
డయాగ్నొస్టిక్ కేంద్రానికి కృషి
ఈ సామాజిక ఆసుపత్రి పరిధిలో తెలంగాణ డయాగస్టిక్ హబ్ ఏర్పాటు చేయడానికి కషి చేస్తున్నామని, ప్రభుత్వం ద్వారా ఆదేశాలు రాగానే పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రి పక్కనే ఉన్న రెండు పాత భవనాలను తొలగించి, ఆ ప్రదేశంలో తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ నిర్మించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న మాతా శిశు సంరక్షణ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.