Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
సంక్షేమ హాస్టళ్ల విద్యార్ధులకు మెనూ, కాస్టోటిక్ చార్జీలను పెంచాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని బీసీ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులను సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1300మంది విద్యార్థులు ఆత్మబలిదానంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎక్కడ మెరుగైన పరిస్థితి లేదన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణంలో విపలమైందని విమర్శించారు. కనీసం సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించింది లేదన్నారు. కరోనా తర్వాత ప్రారంభమై సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ, కాస్మోటిక్ చార్జీలను పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకుండపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.30లు, నెలకు రూ.60 చొప్పున మాత్రమే కేటాయించడం వల్ల ఏవిధంగా నాణ్యమైన భోజనం, ఖర్చులకు సరిపోతుందని ప్రశ్నించారు. మరో వైపు కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇక్కట్ల పాలువుతున్నారన్నారు. ఈ పరిస్థితిల్లో అనేక మంది విద్యార్థులు హాస్టల్ల్లో ఉండలేక చదువులకు దూరం కావాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రభుత్వం మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచుతూ మౌళిక వసతులను మెరుగుపర్చాలన్నారు. లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాల్సిన వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీనివాస్, కష్ణ, రాజు, తిరుపతి, కుమార్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.