Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డులు సక్రమంగా లేకపోవడంపై డీపీఓ ఆగ్రహం
నవతెలంగాణ-శాయంపేట
పంచాయతీ కార్యాలయంలోని రికార్డులు సక్రమంగా లేకపోవడం, గ్రామసభ పాలకవర్గ సభ్యుల తీర్మానంలో సభ్యుల సంతకాలు లేకపోవడంపై డీపీఓ జగదీశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇవి రిజిస్టర్‌లా, రఫ్ బుక్కులా అంటూ పంచాయతీ కార్యదర్శి చంద్రా రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పంచాయతీ కార్యదర్శిపై మెమో జారీ చేయాలని ఎంపీవో రంజిత్ కుమార్‌ను ఆదేశించారు. మైలారం పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మీకంగా పరిశీలించారు. రిజిస్టర్‌లోని ప్రతి రికార్డు అప్డేట్ చేయాలని ఆదేశించారు. బిల్లు రశీదులపై బిల్ కలెక్టర్ సంతకం మాత్రమే ఉండడంతో పంచాయతీ కార్యదర్శి ఎందుకు సంతకం చేయలేదని ప్రశ్నించారు. తప్పులను వెంటనే సరి చేసుకోవాలని హెచ్చరించారు ఇంటి పన్నులు మాన్యువల్‌గా కాకుండా, ఆన్లైన్లో వసూల్ చేయాలన్నారు. గ్రామంలోని వర్తక, వాణిజ్య వ్యాపారులకు లైసెన్సులు వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. ఇంటి, నల్ల పన్నులు వసూలు చేయగానే ఎప్పటికప్పుడు ఎస్టీఓలో జమ చేయాలని, 4200 వసూలు చేసి పది రోజులు గడిచినా ఎందుకు ఎస్టీఓలో జమ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం గ్రామంలోని శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్, గ్రామ నర్సరీని పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్ బాగా లేదని, పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా లేవని తెలిపారు. మొదటిసారి కావడంతో క్షమిస్తు న్నానని, రెండోసారి తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నవంబర్8 లోగా రికార్డులు సరి చేయకుంటే పంచాయతీ కార్య దర్శిని సస్పెండ్ చేస్తానని పేర్కొన్నారు. అనం తరం డీపీఓను సర్పంచ్ అరికిళ్ళ ప్రసాద్ సన్మానించారు.