Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు. బుధవారం మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట్ పంచాయతీల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా చల్వాయి హెల్త్ సబ్సెంటర్ను తనిఖి చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై మెడికల్ ఆఫీసర్ సుకుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, తహశీల్దారు రమాదేవిలతో చర్చించి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. చల్వాయిలోని పల్లె ప్రకతి వనం, సెగ్రిగేషన్ షెడ్ పనులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని పల్లె ప్రకతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి యాదగిరిని ఆదేశించారు.ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో 50మందికి తగ్గకుండా కూలీలతో పనులు చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ దేవరాజు, ఎంపీఓ రామకష్ణ, కార్యదర్శులు సుమలత, స్వాతి, ఉపాధి హామీ పథకం ఏ పీఓ రాజు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు
అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాటిని బుధవారం తెలంగాణ ఉద్యమ కారుల సంఘం జిల్లా అధ్యక్షులు గజ్జి మల్లికార్జున్ పుష్పగచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో విధులు నిర్వర్తించిన అంతకాలం పారదర్శకంగా పాలన సాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.