Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-హసన్‌పర్తి
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసుల పాత్ర కీలకమని వరంగల్ నగర పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి అన్నారు. ఎర్రగట్టుగుట్ట బాలాజీ గార్డెన్స్‌లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం కాజీపేట్ పోలీసు డివిజిన్ అధ్వర్యంలో హనుమకొండ అర్బన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి రక్తదాతలకు పండ్లు, సర్టిఫికెట్లు అందచేశారు. అనంతరం మాట్లా డుతూ.. పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి ఆశయసాధనకు పోలీసు ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరారు. కాజీపేట్ డివిజన్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది, యువతను రక్తదానం చేసే విధంగా ప్రోత్సహించి రక్తదానం చేసినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ కె.పుష్పారెడ్డి, హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పీ విజయచందర్ రెడ్డి, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవీ శ్రీనివాస్‌రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, కాజిపేట్ అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ పి.శ్రీనివాస్, హాసనపర్తి ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు, ధర్మసాగర్ సీఐ రమేష్, ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.