Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారానికి మార్గం ఎర్రజెండాయే.. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జీ.నాగయ్య
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు బలమైన పోరాటాలను చేపట్టాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జీ.నాగయ్య పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఐఎంఏ హాల్లో సీపీఐ(ఎం) నాయకులు అనంతగిరి రవి, గుజ్జుల ఉమా అధ్యక్షతన నిర్వహించిన పార్టీ పట్టణ 3వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను కారుచౌకగా అమ్మేస్తుందన్నారు. యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను యధేశ్ఛగా కార్పొరేట్లకు కట్టబెట్టే పనిలో పడిందని తెలిపారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేసి రైతులను నిండ ముంచే మూడు నల్లచట్టాలను తీసుకొచ్చిందని, వీటిని వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో తొమ్మిది నెలల పాటు ఆందోళన పోరాటాలు చేస్తున్న రైతులను నిర్థాక్ష్యణంగా అణిచివేసే చర్యలు చేపట్టిందన్నారు. చివరకు ఆందోళన చేపటడుతున్న రైతుల ప్రాణాలను తీసి చర్యలకు ఒడిగట్టిందని దుయ్యపట్టారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించి పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీల పట్ల కూడా మాటమార్చడం సిగ్గుచేటన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గట్టేక్కేందుకు దళితబంధు పథకం తీసుకొచ్చి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలనే చెప్పలేదంటూ చెప్పిన కేసీఆర్ రేపటి దళిత బంధు పథకం అమలుపై కూడా మటామార్చడంలో ఆశ్చర్యపడక తప్పదని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం హామీ గాలికొదిలేసి కనీసం ఖాళీలను కూడా భర్తీ చేయని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందన్నారు. ఖాళీలపై కూడా రోజుకో మాట చెబుతూ దాట వేస్తుందని తెలిపారు. ఖాళీలతో పాటు ప్రస్తుతం 4లక్షల ఉద్యోగాలు అవసరమన్నారు. నిరుద్యోగ యువత పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే నియమాకాలు చేపట్టాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల ఎకరాల్లో పోడు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న పేద రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం దాడులను సృష్టిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాల ఫలితంగా ఇటివల మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో కమిటీ వేసిందని తెలిపారు. ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఎఫ్ఆర్సీ కమిటీల ప్రమేయం లేకండా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. అటవీ హక్కుల చట్ట ప్రకారం గ్రామ సభలు నిర్వహించి ఈ మేరకు అర్హులైన పోడుదారులందరికి హక్కు పత్రాలను ఇవ్వాలన్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు బలమైన పోరాటాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండు ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంలో కాంగ్రేస్ వైఫల్యం చెందిందనీ, ఒక్క ఎర్ర జెండా మాత్రమే ప్రతి నిత్యం ప్రజల వెంటే ఉంటూ సమస్యల పరిష్కానికి మార్గం చూపుతూ వచ్చిందని తెలిపారు. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలను కూడగట్టి నిర్మాణాత్మక పోరాటాలకు సిద్ధం కావాలని, ఇందుకు మహాసభలు సరైన మార్గం చూపుతుందన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు నలగంటి రత్నమాల, జిల్లా కమిటీ సభ్యులు భూక్య సమ్మయ్య, ఈసంపెల్లి బాబు, కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్, గడ్డమీద బాలకృష్ణ, గుజ్జుల వెంకన్న, కందికొండ రాజు, మండల అశోక్, హన్మకొండ సంజీవ తదితర పట్టణ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.