Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
సమాజానికి దూరమై ఆదరణకు నోచుకోని ఎయిడ్స్ రోగులు, అనాధ కుటుంబాలు, అనాధ బాల బాలికలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాజారపు ప్రతాప్ కోరారు. బుధవారం సిద్ధార్థనగర్‌లోని తన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కొలంబో ఫాదర్ ఆశయ సాధనలో భాగంగా కరుణపురంలో అనాధ యువతీయువకులను, హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిన పిల్లలను చేరదీసి అన్ని విధాల వసతులు కల్పించినట్టు పేర్కొన్నారు. కరుణపురంలో కొలంబో ఫాదర్ గతంలో కొనుగోలు చేసిన 50ఎకరాల భూమిలో మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటునకు ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. కేసీఆర్ పాలనలో పేదలకు, అనాథలకు అన్ని సదుపాయాలు అందుతాయని ఆలోచనతో గతంలో టీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కోల జనార్దన్ గౌడ్, నాయకులు మూల ఎల్లస్వామి, దండు కుమార్, గుర్రపు దయాకర్, వెంకటస్వామి, రాజేందర్ పాల్గొన్నారు