Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ త్రిపాఠి బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ - ములుగు
ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ పథకాలను అధికారుల సహకారంతో లక్ష్యం దిశగా ముందుకు తీసుకువెళ్తానని అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్ కృష్ణ్ణ ఆదిత్యని మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం ఆమె అదపు కలెక్టర్గా భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ ములుగు జిల్లాను లక్ష్యం దిశగా నడిపిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్ఓ రమాదేవి, డీఆర్డీఓ నాగ పద్మజ, జిల్లా పౌర సంబంధాల అధికారి ప్రేమలత, జిల్లా తహశీల్దార్లు, ఏఓ జే శ్యామ్ కుమార్, సిబ్బంది ఆమెను శుభాకాంక్షలు తెలిపారు.