Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
కల్లు గీతా కార్మికులకు గీతన్నబంధు ఇవ్వాలని సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య, జిల్లా కార్యదర్శి బాల్నే వెంకటమల్లయ్య అన్నారు. బుధవారం హాజరై మాట్లాడుతూ మండల కేంద్రంలో కల్లుగీత కమిటీ భవనంలో బత్తిని దశరథ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గీతా కార్మిక సభ్యత్వం ఉన్న ప్రతి కార్మికుడికి ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని,కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.25 వేలు ఇవ్వాలని, వికలాంగులకు రూ.10 వేలు ఇవ్వాలని, సొసైటీలకు 5 నుంచి 10ఎకరాల భూమి ఇవ్వాలని కోరారు. జిల్లా కేంద్రంలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. బార్ అండ్ వైన్స్ షాపుల్లో 15శాతం రిజర్వేషన్ వల్ల కల్లుగీత కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదని, కల్లుగీతా కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్టు వెంకటయ్య, అంజయ్య, మాచర్ల రఘురాములు, వడ్లకొండ భాస్కర్, వంగ వేణు, రమేష్, రంగు ప్రభాకర్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.