Authorization
Sat March 22, 2025 12:28:11 pm
నవతెలంగాణ-గార్ల
తెలంగాణ ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ సంఘం బలోపేతానికి సభ్యత్వ నమోదుకు నాయకులు కషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర బాధ్యులు మోకాళ్ల రామచంద్రు కోరారు. మండల కేంద్రంలో బుధవారం మాడి రామకష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగు ణంగా బాకిన పడిన డీఎలను, జీఓలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3ను పునరుద్ధరించాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రచార కార్యదర్శి వీరభద్రం, మండల నాయకులు వెంకన్న, వీరాస్వామి, అనసూర్య, మమత రాణి, సుభద్ర, లలిత తదితరులు ఉన్నారు.