Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వ మేనని మండల ముదిరాజు మహాసభ అధ్యక్షులు వంగాల గోవర్ధన్ అన్నారు. బుధవారం జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని జనగామ జిల్లా ముది రాజు మహాసభ ప్రచార కార్యదర్శి ఇట్టబోయిన రమేష్ ఆధ్వర్యంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఉచిత చేపపిల్లల పంపిణీ, సబ్సీడిపై ద్విచక్ర వాహనాలు బోలేరోలు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తున్నారని అన్నారు. నియోజకవర్గ రిజర్వాయర్లను, చెరువులను నిండు కుండ లాగా నింపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతకింది సురేష్, ముదిరాజు ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన రాజు, చేర్యాల సత్యనారాయణ, ముదిరాజ్ మహాసభ నాయకులు బండి రామలింగం, మత్స్య శాఖ సొసైటీ చైర్మన్లు ఉచ్చేంతుల రాజయ్య, పిట్టల కనకయ్య, మిడిదొడ్డి మల్లయ్య, నాయకులు పర్శరాములు, ఉపేందర్, లింగం, రాజు, సురేష్, చంద్రమౌళి పాల్గొన్నారు.