Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
దేశెట్టి రామచంద్రయ్య
నవతెలంగాణ-కొత్తగూడ
పీసీ చట్టం ప్రకారమే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి రామచంద్రయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో జిల్లా నాయకులు గుగులోత్ హచ్చ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవిని ఆధారం చేసుకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల బ్రతుకులను బుగ్గిపాలు చేసేలా పోడు భూముల పట్టాల ప్రక్రియ ఉండబో తుందని విమర్శించారు. పట్టాల విషయంలో ఎమ్మెల్యేల జోక్యం ఉండవద్దని చెప్పారు. హరితహారం పేరుతో, ట్రెంచ్‌లు కొట్టిన భూములన్నింటిని ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిలభారత రైతుకూలి సంఘం నూతన మండల కమిటీని జిల్లా అధ్యక్షులు సనప పొమ్మన్న అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బూర్క బుచ్చిరాములు, ఉపాధ్యక్షులుగా జిట్టబోయిన రామచంద్రు, ప్రధాన కార్యదర్శిగా యాదగిరి యుగంధర్, సహాయ కార్యదర్శి గా గజ్జి సోమన్న, కోశాధికారిగా పిట్టల దేవేందర్, సభ్యులుగా ఎర్రన్న, సమ్మన్న, సారన్న,జామ్లా, రూప్లా, లాలు జంగా సదయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు పోమ్మన్న తెలిపారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ సభ్యులు బూర్క వెంకటయ్య, గట్టి సురేందర్, గట్టి సతీష్, రాజమల్లు, శ్రీను, నరేష్, రాంసింగ్, రమ, సరోజన పాల్గొన్నారు.