Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబోదిబోమంటున్న డీలర్లు
నవతెలంగాణ-జనగామ రూరల్
సివిల్ సప్లై ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి సరఫరా కేంద్రం (ఎంఎల్ఎస్ పాయింట్) వద్ద ఎలాంటి తూకం లేకుండా బియ్యం సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. బ50 కిలోల సంచికి 5 నుండి 10 కిలోలు తక్కువగా వస్తుండడంతో డీలర్లు లబోది బోమంటున్నారు. లబ్ధిదారులు మాత్రం డీలర్ల వద్ద తూకం వేసి తీసుకుంటున్నారు. ప్రభుత్వం తూకం లేకుండా సరఫరా చేస్తున్న నేపథ్యంలో తక్కువగా వస్తున్న బియ్యాన్ని ఎలా సర్దుబాటు చేయాలని డీలర్లు వాపోతున్నారు.
జనగామ సమీపంలోని చంపక్‌హిల్స్‌లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ నుండి జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని గ్రామాల వారిగా డీలర్లకు బియ్యం సరఫరా అవుతున్నాయి. సివిల్ సప్లై స్టేజి 1 గోదాముల నుండి ఇక్కడికి నెలనెలా కోట ప్రకారం బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. స్థానిక మండల స్థాయి సరఫరా కేంద్రం నుండి ఎలాంటి తూకం లేకుండా బియ్యాన్ని సరఫరా చేస్తుండగా తక్కువగా వస్తున్నాయని డీలర్లు వాపో తున్నారు. ఎమ్మెల్యేస్ పాయింట్ వద్ద ఉన్న తూకాలు వేసే కాంటాలు వృథాగా పడి ఉన్నాయి. వాటిని మరమ్మతు చేయించే నాధుడే లేడు. ఎమ్మెల్యేస్ పాయింట్ అధికారి దాదాపు పది సంవత్సరాలుగా ఎలాంటి బదిలీ లేకుండా అక్కడే తిష్ట వేశారు. ప్రస్తుతంఈ ఎమ్మెల్యేస్ పాయింట్ కు ప్రతినెల స్టేజి గోదాముల నుండి 25 వేల క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతున్నాయి. జనగామ పట్టణం తోపాటు జనగామ మండలం, నర్మెట, తరిగొప్పుల బచ్చన్నపేట, లింగాలగణపురం, రఘునాథపల్లి దేవరుప్పుల మండలాల్లోని గ్రామాల వారీగా డీలర్లకు బియ్యాన్ని ఇతర సరుకులను స్టేజ్- 2 కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇక్కడి నుండి తూకం లేకుండా పంపిస్తుండడం గమనార్హం. 50 కిలోల సంచి కి అయిదు నుండి పది కిలోలు తక్కువగా వస్తుండడంతో డీలర్లకు ఎటూ పాలుపోవడం లేదు. చాలా సంవత్సరాలుగా ఎమ్మెల్యేస్ పాయింట్ వద్ద ఉన్న కాంటాలు వృథాగా ఉన్నాయని, వాటిని మరమ్మతు చేసి తూకం వేసిన తర్వాతనే సరుకులను తమకు సరఫరా చేయాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆరు నెలలుగా ఒక్కో లబ్ధిదారునికి 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా నవంబర్ కోటతో ఉచిత బియ్యం పథకం రద్దు అవుతుంది.
జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం : మండలస్థాయి సరఫరా కేంద్రం అధికారి శ్రీధర్‌రెడ్డి
స్టేజి 1 గోదాముల నుండి తమకు సరఫరా అయిన బియ్యాన్ని అలాగే డీలర్లకు సరఫరా చేస్తున్నామని, డీలర్లు డిమాండ్ చేస్తే తూకం వేసి ఇవ్వడానికి తాము సిద్ధమని, ఈ విషయాన్ని జిల్లా అధికారుల దష్టికి తీసుకెళ్తానని