Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ప్రత్యేక రాష్ట్రంలో కలిసొచ్చిన టీఆర్ఎస్ నినాదమే కాకుండా, టీఆర్ఎస్ అంటే తాటికొండ రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్ అని పేరొచ్చిన ఈ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. నవంబర్ 15న జరగబోయే విజయ గర్జన సందర్భంగా బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల్లే దేవుళ్ళని కొనియాడారు. ఈప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతానికి కాకుండా, ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా నిలిచి గులాబీ జెండా అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ స్టాన్డింగ్ కమిటీ ఛైర్మన్ మారపాకరవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఎంపిపి రేఖ, వైస్ ఎంపిపి చల్లా సుధీర్ రెడ్డి, చిల్పూర్ దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధసర్ రావు,సర్పంచుల ఫోరం అధ్యక్షులు సురేష్, జిల్లా జడ్పీటిసి ల అధ్యక్షులు బొల్లం అజరు, బేబీ శ్రీనివాస్, మండల అధ్యక్షులు గణేష్ పాల్గొన్నారు.