Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు141 కేంద్రాల ఏర్పాటు
- కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హన్మకొండ జిల్లాలో యాసంగిలో ప్రైవేటు విత్తన కంపెనీలతో ఒప్పందంలో వున్న రైతులు వరి విత్తనోత్పత్తి చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సివిల్ సప్లయిస్, సహకార, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారనులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ మాట్లాడారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు 141 కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేశామని తెలిపారు. నీరు నిలువ వుండే నేతలు, చౌడు భూముల్లో వరి పంటను సాగు చేసుకోవాలన్నారు. జిల్లాలో సాగుకు అను కూలమైన శనగ, పెసర, మినుముల వంటి పప్పు దినుసులు అదేవిధంగా వేరుశనగ, నువ్వులు, ఆవాలు వంటి నూనెగింజల పంటలు ఉత్పత్తి చేసుకోవాలన్నారు. ఈ విత్తనాలను సీడ్ కార్పొరేషన్, అధీకృత డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో వుంచుతామన్నారు. జిల్లాలో వానాకాలం సీజన్‌కు 3 లక్షల 61 వేల మెట్రిక్ టన్నుల దిగుబడుల మేరకు 141 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 48 ఐకెపి కేంద్రాలు, పీఏసీఎస్ 91, ఎఎంసీి 2 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. యాసంగి పంట కాలంలో వరి విత్తనోత్పత్తి చేసుకోవ చ్చన్నారు. జిల్లాలో 58 రైస్ మిల్లులున్నాయని, సన్నరకంపు ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సంసిద్ధంగా వున్నందునా రైతులు సన్నాలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. బోర్లు, బావుల కింద పప్పు ధాన్యాల సాగు మెట్ట ప్రాంతాల్లో బోర్లు, బావుల కింద పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలను అధిక మొత్తంలో సాగు చేయాలని రైతులకు కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం ఉండొద్దన్నారు. రైతులకు నష్టం కలిగించే చర్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, డిఆర్డిఓ శ్రీనివాస్‌కుమార్, జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి వసంతలక్ష్మీ, జిల్లా మేనేజర్ కృష్ణవేణి, డీిఏఓ ఉషాదయాళ్, ఏడీ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.