Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాతల సాయానికి ఎదురుచూపు
నవతెలంగాణ-మహాముత్తారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన నాగవత్ సుగుణ బాసు నాయక్ కుమారుడు నాగవత్ పవన్ ఐఐటీలో సీటు సాధించి సత్తాచాటాడు. వివరాల్లోకెళితే... మండల పరిధి పోచంపల్లి గ్రామంలో నివసిస్తూ వ్యవసాయామే ఆధారంగా పవన్ కుటుంబం జీవనం సాగిస్తున్నది. వారికి ముగ్గురు పిల్లలుకాగా పెద్దవాడు కరీంనగర్ లో పీజీ చేస్తున్నారు. చిన్నవాడైన నాగవత్ పవన్ చదువులు మొదటి అక్షరం అంగన్వాడి కేంద్రం పోచంపల్లి నుండి ప్రారంభమైంది. 4వ తరగతి వరకు, 5 నుండి 10 వరకు కాటారం గురుకులంలో, ఇంటర్ మరిమడ్ల ఏకలవ్య మోడల్ కాలేజీ గురుకులంలో విద్యనభ్యసిం చాడు. అధ్యాపకుల సలహా మేరకు ఐఐటి పరీక్షలు రాసి మొన్న వెలువడిన ఫలితాలలో 490 ర్యాంక్ సాధించారు. ఉత్తర ప్రదేశ్ లోని ఐఐటి (బీహెచ్‌యూ) వారణాసి సరామిక్ ఇంజనీరింగ్‌లో సీటు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం వారణాసికి వెళ్లాలంటే మొత్తం ఖర్చులు రూ.70 వేల వరకు అవుతాయని దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని పవన్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... జాతీయస్థాయిలో 490 ర్యాంకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. తమ తల్లిదండ్రులు వ్యవసాయం చేసి జీవనం కొనసాగిస్తున్నారని, తాను చదువుకోవాలన్న వారి కోరిక మేరకు అధ్యాపకుల ప్రోత్సాహంతో అనుకున్న ఫలితం రావడం ఆనందంగా ఉందన్నారు. తన కల నెరవేరేందుకు దాతల ఆర్థిక సహాయం అవసరముదని అన్నారు.