Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబా లను కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం పరామర్శించారు. పసర గ్రామానికి చెందిన గూడూరు వెంకట రమణమ్మ, దేవురపల్లి రాజిరెడ్డి, తుంగ పాటి సాంబయ్య వేర్వేరు కారణాలతో ఇటీవల మృతి చెంద గా వారి కుటుంబాలను సీతక్క కలిసి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మీ, కన్నాయిగూడెం ఎంపీపీ జనగాం సమ్మక్క, సహకార సంఘం చైర్మెన్ పన్నాల ఎల్లారెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సీతారాం నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి కుమార్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సూడి సత్తిరెడ్డి, సర్పంచ్ ముద్దబోయిన రాము, గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఉప సర్పంచ్ బద్దం లింగారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా నాయకులు పాలడుగు వెంకటకష్ణ, సూదిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, జంపాల చంద్రశేఖర్, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు పంగ శ్రీను, యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కొల్లు శ్రీనివాస్‌రెడ్డి, మందటి ఉత్తరయ్య, యాస సత్తిరెడ్డి, వార్డు సభ్యులు చెరుకుల సురేష్, కొర్ర శ్రీను, ఏనుగు సునీత, మిరియాల యాదగిరిరెడ్డి, కందాల సమ్మిరెడ్డి, తండ రవి, మేడె సైదిరెడ్డి, పత్తిరి మధు, తిక్క దుర్గారావు, జంపయ్య, రాజు, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.