Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
నగర సమగ్రాభివద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో నగర సమగ్రాభివద్ధికి, సుందరీకరణకు చేపట్టవలసిన పనుల గురించి మేయర్ వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రతి డివిజన్‌కు రూ.లు 50 లక్షలు కేటాయించిన నేపధ్యంలో గుర్తించిన అభివద్ధి పనులకు వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. మహానగరంలో పలు కూడలిలను అభివద్ధి చేశామన్నారు. ఇంకా 12 మోరీల జంక్షన్, జెమిని టాకీస్, ఎంజీఎం, పోచమ్మ మైదాన్, ప్రధాన తపాలా కార్యాలయం, బస్‌స్టేషన్, ఎస్ఎంఎం క్లబ్, ఖిలా వరంగల్ రోడ్, కాశిబుగ్గ, వెంకట్రామ, గవిచర్ల రోడ్, గొర్రెకుంట, కిట్స్ కాలేజ్, మడికొండ తదితర జంక్షన్ల సుందరికరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నగరవ్యాప్తంగా దాదాపు 500 పైపులైన్ లికేజీలు ఉన్నాయని, వాటిని అరికట్టుటకు, పైపులైన్లు వేయడం వల్ల చెడిపోయిన రోడ్ల మరమ్మతుల టెండర్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. మహానగరంలో 5మోడల్ వైకుంఠధామల నిర్మాణానికి కనీసం 2ఎకరాల స్థలం తక్షణమే గుర్తించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, సీపీ వెంకన్న, ఈఈలు శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రావు, డీఈలు నరేందర్, సంతోష్ బాబు, రవి కుమార్, రవి కిరణ్, ఏసీపీ బషీర్ తదితరులు పాల్గొన్నారు.