Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
నిషేదిత మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎస్సై సౌమ్య హెచ్చరించారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్, సీఐ ఆర్ ప్రవీణ్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చింతల తండా, కన్నారం, లోక్య తండాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురు వ్యక్తులను తహశీల్దార్ సమ్మయ్య, ఆర్ఐ సమ్మయ్యల ఆధ్వర్యంలో బైండోవర్ చేశారు. బైండోవర్ చేసిన వారిలో లోక్యా తండాకు చెందిన మురావత్ కమలమ్మ (53), మురావత్ బిక్షపతి(65), గూగులోతు మంజుల(24), మురావత్ బద్రు(50), చింతల్ తండాకు చెందిన మాలోత్ అంజమ్మ(40), మాలోతు వీరమ్మ(61), కన్నారం గ్రామానికి చెందిన వేముల నారాయణ(68)లున్నారు. మండలంలో నిషేదిత గంజాయి, నాటు సారా, మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలు అమ్మకాలు జరిపినట్లయితే రెండు లక్షల రూపాయల జరిమానాతో పాటు రెెండేండ్ల జైలు శిక్ష విధించనున్నట్టు హెచ్చరించారు. తనిఖీల్లో ఎక్సైజ్ సిబ్బంది వీర మల్లయ్య, ఆయుబ్, దీప్తీ తదితరులు పాల్గొన్నారు.