Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని వెటర్నరీ అసిస్టెంట్ విజరుభాస్కర్ రైతులకు సూచించారు. మండలంలోని అమ్మాపురం, కొత్తగూడెం, తదితర గ్రామాల్లో పశువులకు గురువారం వ్యాధి నిరోధక టీకాలు వేయించారు. ఈ సందర్భంగా విజరుభాస్కర్ మాట్లాడారు. మండల ప్రభుత్వ పశు వైద్యశాల ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం నెలరోజుల పాటు ఉంటుందని తెలిపారు. నాలుగు నెలలకుపైబడ్డ గేదెలకు, ఆవులకు, ఎద్దులకు, దున్నలకు టీకా వేస్తామన్నారు. టీకా వేయించిన పశువులన్నిటికీ టోకెన్ నెంబర్ ఇస్తామన్నారు. తద్వారా ఏ గ్రామంలో ఎన్ని పశువులున్నాయో తెలుస్తుందని చెప్పారు. కొత్తగూడెం, అమ్మాపురం గ్రామాల్లో 200లకుపైగా పశువులకు టీకాలు వేశామన్నారు. కార్యక్రమంలో ఎల్ఎస్లు విజయభాస్కర్, రాజయ్య, వెటర్నరీ అసిస్టెంట్ శోభారాణి, ఆఫీస్ సబార్డినేట్ హాసన్ తదితరులు పాల్గొన్నారు.