Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-కన్నాయిగూడెం
మంలానికి గోదావరి నీరందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో లక్ష్మణ్‌రావు అధ్యక్షతన గురువారం నిర్వహించిన మండల ప్రథమ మహాసభకు వెంకట్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగాన్ని ప్రయివేట్, కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెడుతోందని విమర్శించారు. వ్యవసాయాన్ని నీరు గార్చేలా, రైతులను కూలీలుగా మార్చేలా ఇటీవల మూడు తప్పుడు చట్టాలను తీసుకురాగా రైతులు సుమారు 11 నెలలుగా ఉద్యమిస్తున్నారని చెప్పారు. మండలంలో దేవాదుల సమ్మక్క సారక్క మ్యారేజ్ నిర్మించినా రైతులకు సాగు నీరు అందని పరిస్థితుల్లో రైతులు ఈ ఏడాది వందలాది ఎకరాల్లో నాటు వేయలేదని తెలిపారు. వెంటనే మండలానికి గోదావరి నీరు అందించాలని, పోడు భూములకు గిరిజనులకు హక్కు పత్రాలివ్వాలని, అటవీ శాఖ అధికారుల దాడులు ఆపాలని తీర్మానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రత్నం ప్రవీణ్, నాయకులు బీరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్, దావూద్, కావేరి సుధాకర్, కోరం చిరంజీవి, ఇబ్రహీమ్, బాషా, మంచాల రామారావు, నల్లబోయిన మధు, మల్లయ్య, సదానందం, సడవలి, తంపెల్లి సురేష్, సమ్మయ్య, చాట్ల నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.