Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ వెంకటరమణ
నవతెలంగాణ-నల్లబెల్లి
కరోనా నుంచి రక్షణ కోసం ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని డీఎంహెచ్ఓ వెంకటరమణ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, డీఐఓ ప్రకాష్‌లు గురువారం పరిశీలించారు. అనంతరం శనిగరం గ్రామంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని పరిశీలించారు. గ్రామంలో వ్యాక్సిన్ పరిస్థితులను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకొని వారిని కలిసి వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించి వ్యాక్సిన్ వేయించారు. వ్యాక్సినేషన్ లో ప్రతి ఇంటికి స్టిక్కర్లు వేస్తున్నారా లేదా అనే విషయాన్ని వారు గమనించారు. ప్రతి గ్రామంలో వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి కావాలని సిబ్బందికి సూచించారు. వ్యాక్సిన్ వేసుకొని వారిని కలిసి వ్యాక్సిన్ వల్ల కలిగే ఉపయోగాలు తెలిపి వ్యాక్సిన్ వేయాలని సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి వైద్య అధికారి మహేందర్ నాయక్, మేడపల్లి వైద్య అధికారి శశి కుమార్, శనిగరం సర్పంచ్ మల్లికాంబ, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.