Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
విద్యార్థి ఆత్మబలిదానాలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ నేడు వారి జీవితాలతోనే చెలగాటం ఆడుతు న్నారని ఏఐఎఫ్డీి ఎస్ జాతీయ కన్వీనర్ డాక్టర్ మైత్రి రాజశేఖర్ విమర్శించారు. గురు వారం స్థానిక ఓంకార్ భవన్లో సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి చిరంజీవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్ల పాలనలో డీఎస్సీ నోటిపికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాల యాలు సమస్యలకు నెలవుగా మారాయన్నారు. శిథిలావస్థలో ఉన్న విద్యాల యాలు ఎప్పుడు కులీపోతాయో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని నినాదాలు చేస్తున్న ప్రభుత్వం కనీసం పక్కా భవనాలు నిర్మించే పరిస్థితిలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ నియంత్రించడంలో ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని మండిపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, జిల్లా ఉపాధ్యక్షులు లక్క సన్నీ, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల సాయి, సంకినేని సాయి, సాయి కుమార్, ప్రణరు తదితరులు పాల్గొన్నారు.